గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వమే గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు. నూతన టెండర్లను పిలిచి రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, సిబ్బంది మాధవి, గంగన్న, నీల, కమల, కృష్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


