ఖోఖో జట్టుకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీటీడీవో రమాదేవి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థినులు క్రమశిక్షణ, సా మర్థ్యం, కఠోర శ్రమతో సాధించిన ఈ విజ యం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్‌వో షేకు, పీ డీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


