సీఐటీయూ జిల్లా కమిటీ ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల్లో రెండోరోజు మంగళవారం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నా రు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలుగా ఆర్.త్రివేణి, జిల్లా కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా శంకర్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బాలకిషన్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమాచారి, పద్మ, కమిటీ సభ్యులుగా స్వరూప, శారద, మాయ, అరుణ, ఛాయ, మోరేశ్వర్, చంద్రన్న, ప్రభాకర్, ఆనంద్, గంగామణి, శంకర్ ఎన్నికయ్యారు.


