భవితకు బాసట | - | Sakshi
Sakshi News home page

భవితకు బాసట

Dec 2 2025 7:42 AM | Updated on Dec 2 2025 7:42 AM

భవితక

భవితకు బాసట

కేజీబీవీల్లో నీట్‌, ఐఐటీ, క్లాట్‌ తరగతులు జిల్లాలో మూడు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఎంపిక సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థినులు

ఉచిత

శిక్షణ..

ఆసిఫాబాద్‌రూరల్‌: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని బాలికలు ఉన్నత చదువులకు మార్గం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంపిక చేసిన కేజీబీవీల్లో నీట్‌, ఐఐటీ, క్లాట్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా బాలికలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మూడు కేజీబీవీలను యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి ప్రస్తుతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు.

కార్పొరేట్‌ స్థాయి శిక్షణ

సాధారణంగా ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్స రం విద్యార్థులు బీటెక్‌, మెడిసిన్‌, ఇతర ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంబంధిత కోర్సుల్లో ప్రవేశం కోసం కార్పొరేట్‌, ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. అయితే పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించలేక కోచింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో అనుకున్న విద్యాసంస్థల్లో సీటు పొందలేకపోతున్నారు. ఈ తరుణంగా కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించింది. నీట్‌, ఐఐటీ, క్లాట్‌ శిక్షణ కోసం ని ధులు మంజూరు చేసింది. అవసరమైన మెటీరి యల్‌, పుస్తకాలు అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేలా నీట్‌, ఇంజినీరింగ్‌ విద్యను అభ్యసించేలా ఐఐటీ, జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా క్లాట్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సైకాలజిస్టులను కూడా నియమించన్నుట్లు అధికారులు తెలిపారు.

సంతోషంగా ఉంది

నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు నీట్‌, ఐఐటీ, క్లాట్‌పై శిక్షణ అందించడం సంతోషంగా ఉంది. శిక్షణతో చాలామంది బాలికలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కలుగుతుంది. నాకు డాక్టర్‌ కావాలని ఉంది.

– అక్షర, బైపీసీ సెకండియర్‌

విద్యార్థినులకు వరం

కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు ఉచిత శిక్షణ వరంలాంటిది. మంచి కార్పొరేట్‌ సంస్థల్లో మాదిరి రాష్ట్రం ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థినులు దీనిని సద్వినియోగం చేసుకుని ర్యాంకులు సాధించాలి.

– భాగ్యలక్ష్మి, కేజీబీవీ ఎస్‌వో

మూడు కేజీబీవీలు ఎంపిక

జిల్లాలోని 15 కస్తూరిబా విద్యాలయాల్లో మొ త్తం 4,177 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఏటా వార్షిక పరీక్షల్లో కేజీబీవీ వి ద్యార్థినులు సత్తా చాటుతున్నారు. కొన్ని వి ద్యాలయాలు వందశాతం ఫలితాలు సాధి స్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) కేజీబీవీలను ప్రభుత్వం యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ కేంద్రాలుగా గుర్తించింది. ఆసిఫాబాద్‌లో నీట్‌, కాగజ్‌నగర్‌లో ఐఐటీ, సిర్పూర్‌(టి)లో క్లాట్‌ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

భవితకు బాసట1
1/1

భవితకు బాసట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement