ఏరియాలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
● ఇన్‌చార్జి జీఎం నరేందర్
రెబ్బెన(ఆసిఫాబాద్): నవంబర్‌లో బెల్లంపల్లి ఏరియా 101 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా ఇన్‌చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. నవంబర్‌లో ఏరియాకు 3.50 లక్షల ట న్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.53 లక్షల ట న్నులతో 101 శాతం ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వందశాతం వార్షిక ఉత్పత్తిని సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత నెలలో సింగరేణిలో కేవలం రెండు ఏరియాలు మాత్రమే వందశాతం ఉ త్పత్తి సాధించగా.. అందులో బెల్లంపల్లి ఒక్కటని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


