రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపి ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయస్థానంలో నిలిచారు. మహిళలు, పురుషుల్లో సమానత్వం అనే అంశంపై ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులు శరణ్య, హరిణి, వెన్నెల, అలేఖ్య, గంగలను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక చేశామని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, న్యాయ నిర్ణేతలు వెంకటేశ్వర్లు, రంగయ్య, గైడ్ టీచర్లు అరుణ, నవీన, సులోచన పాల్గొన్నారు.


