కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిపుణులతో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఇన్‌చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8లోగా అన్ని పీఎం శ్రీ పాఠశాలల్లో నిపుణులతో కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రూప్– 1 అధికారులు, ఇతర అధికారులతో తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివా స్, ఎస్‌వో దేవాజీ, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.


