కనీస వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాల ని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణకు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్‌ఎఫ్‌ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని, వెంటనే నూతన టెండర్లు పిలవాలన్నారు. కార్మికులకు అపాయింట్‌మెంట్ లేటర్స్, ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు మంగళవారం నుంచి ఈ నెల 4 వరకు ఆస్పత్రి ఆవరణ లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 5న హైదరాబాద్‌లోని కోటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, నాయకులు, కార్మికులు నగేశ్, కృష్ణ, నీల, రాజ య్య, గంగన్న, కమల పాల్గొన్నారు.


