ఈదురుగాలులతో గజ గజ
● మళ్లీ పెరిగిన చలి ● గణనీయంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ● రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ)లో 9.7 డిగ్రీలుగా నమోదు
తిర్యాణి(ఆసిఫాబాద్): దిత్వా తుపాను ప్రభా వంతో జిల్లావ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు వీయడంతో ఇ బ్బంది పడుతున్నారు. పగలు కూడా చాలా మంది స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గిరిజనులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆదివా రం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ) మండలంలో 9.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిర్యాణి మండలంలోని గిన్నెదరిలో 10.8, తిర్యాణిలో 11.2, కెరమెరిలో 11.4, వాంకిడిలో 12.9, లింగాపూర్ 13.5, పెంచికల్‌పేట్ 13.6, సిర్పూర్(టి), రెబ్బెనలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


