ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. అందరిని భాగస్వాముల ను చేస్తేనే బలమైన ఐక్య కార్యాచరణను అమలు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న, ఉపాధ్యక్షుడు ఇందురావు, నాయకులు రాజ్ కమలాకర్‌రెడ్డి, హేమంత్, రమేశ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.


