నామినేషన్ల జోరు
ఆసిఫాబాద్: జిల్లాలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పూర్తికా గా, రెండో విడత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శనివా రం వరకు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు 521 నా మినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 1,426 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివా రం తొలివిడత నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మరోవైపు రెండో విడత ఎన్నికల్లో భాగంగా బెజ్జూర్, దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని 113 పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 29 నామినేషన్లు రాగా, 992 వార్డు సభ్యుల స్థానాలకు 34 నామినేషన్లు వచ్చాయి.
ప్రచారానికి ఏర్పాట్లు
తొలి విడత నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పోస్టర్లు, బ్యానర్లు సిద్ధ చేసుకోవడంతోపాటు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ప్ర ధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే అభ్యర్థులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రవాణా, విద్య, వైద్యం తదితర సమస్యలపై ప్రచారం చేస్తున్నారు.


