నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
ఆసిఫాబాద్: తెలంగాణ నూతన మద్యం పాలసీ(2025– 27) సోమవారం నుంచి అమల్లోకి రానుంది. కొత్త దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గత నెలలో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకా ణాలకు 727 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.21.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్కో దుకాణానికి సగటున 20, గూడెం దుకా ణానికి అత్యధికంగా 67 దరఖాస్తులు వచ్చా యి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించారు. 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు గడువు పెంచి రీ టెండర్లు నిర్వహించారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారు సోమవారం కొత్త షాపులు ప్రారంభించనున్నారు. అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన దుకాణాలను కొందరు గుడ్‌విల్ కింద కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
రెండేళ్ల వరకు నిర్వహణ
2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల వరకు కొత్త మద్యం దుకాణాల కు జిల్లా ఎకై ్సజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లతో దు కాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. సా మాజిక భద్రత నిబంధనలతో ప్రభుత్వం నియమిత ప్రదేశాల్లో మాత్రమే షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
ఎన్నికల జోష్..
కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు ఈసారి పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నా యి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సగటు న సుమారు రూ.23.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో మద్యం పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మద్యం వ్యాపారులకు ఎన్నికల వేళ లాభాలు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మార్పీకే అమ్మాలి
జిల్లాలో సోమవారం నుంచి 2025– 27 సంవత్సరానికి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాల లొకేషన్లు గుర్తించి 15 మండలాల్లోని 32 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశాం. దుకాణాలు దక్కించుకున్న వారు నిబంధనలు పాటిస్తూ ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి.
– జ్యోతికిరణ్, జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి


