నామినేషన్ కేంద్రాల పరిశీలన
పెంచికల్‌పేట్/బెజ్జూర్: పెంచికల్‌పేట్ మండలం ఎ ల్కపల్లి, బెజ్జూర్ మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీ లించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ని ర్వహించాలన్నారు. దాఖలైన నామినేషన్లను పరిశీ లించి నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది అవసరాలు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ తిరుపతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
చింతలమానెపల్లి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స జావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని ఆదివారం సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో హరిప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
పరిశీలించి.. సూచనలు చేసి
దహెగాం: మండల కేంద్రంలో రైతువేదిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం పరి శీలించారు. ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల్లో ఏ కాలమ్ కూడా ఖాళీగా వదిలిపెట్టకుండా నింపేలా చూడాలన్నారు. సర్పంచ్ అభ్యర్థికి జనరల్ రూ.2,000, ఎ స్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, వార్డు అభ్యర్థులు జనరల్ రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్ అమౌంట్ చెల్లించాలన్నారు. కేంద్రంలోకి అభ్యర్థితోపాటు బలపరిచే ఇద్దరు, ముగ్గురిని మా త్రమే అనుమతించాలని సూచించారు. తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సీఐ కుమారస్వామి, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు.


