ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ విద్యను మరింత బ లోపేతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్న త పాఠశాలలో ప్రీప్రైమరీ పాఠశాలలకు ఎంపికై న 41మంది ఇన్‌స్ట్రక్టర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అంగన్‌వాడీ కేంద్రాల కంటే మె రుగ్గా విద్య అందుతుందనే నమ్మకం తీసుకురావా లని తెలిపారు. 3నుంచి 6ఏళ్ల పిల్లలకు బ్రెయిన్ డెవలమ్మెంట్ అధికంగా ఉంటుందని, చిన్న పిల్లలకు చక్కని ప్రేమ అప్యాయతలతో బోధించాలని సూ చించారు. వారి అభిరుచిని తెలుసుకోవాలని, పిల్ల లు ఇష్టపడేలా సిలబస్‌లోని అంశాలతో పాటు మంచి విలువలు నేర్పించాలన్నారు. విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే


