ఆయుధాల రికార్డును అప్‌డేట్ చేయాలి
ఆసిఫాబాద్: బెల్ ఆఫ్ ఆర్మ్‌లోని ఆయుధాల రికార్డులను నిరంతరం అప్‌డేట్ చేయాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సాయుధ పోలీస్ దళాన్ని సందర్శించి పలు విభాగాలను తని ఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించారు. ఆ యుధాల భద్రతా ప్రమాణాలు, అమ్యునిషన్ నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, బాధ్యతలు, పరికరాల సంరక్షణ, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై ఆర్‌ఐ ఎంటీవో అంజన్న ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పాత రికార్డులను భద్రపరచాలని, అమ్యునిషన్ డంప్‌లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్మూరర్ వ ర్క్‌షాప్‌లో మరమ్మతుల వేగం పెంచాలని, డ్యామే జ్ పరికరాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా వెంటనే రిపేర్ చేయాలని ఆదేశించారు. స్టోర్స్‌లోని సామగ్రిపై నెలకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సమర్ధవంతమైన పోలీసింగ్, ఆయుధాలు–విభాగాల భద్రత కోసం సాయుధ దళ పోలీసుల విధి నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆమె వెంట ఆర్‌ఎస్సై లవన్, సిబ్బంది పాల్గొన్నారు.


