‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు అర్థరహితం’
ఆసిఫాబాద్: డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ సీనియర్ నా యకుడు వసంత్‌రావు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు మసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌తో కలిసి శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. శ్యాంనాయక్ కెరమెరిలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ సమక్షంలో విశ్వప్రసాద్‌పై చే సిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలి పారు. శ్యాంనాయక్ జిల్లాలో ఎంవీఐగా ఉన్నపుడు వసూళ్లకు పాల్పడడం తెలిసే ప్రజలు గత ఎన్నికల్లో ఓటు వేయలేదని, ఇందుకు డీసీసీ అధ్యక్షుడిని బా ధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తిర్యాణికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్‌గౌడ్, ఆయన సతీమణి, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌పై శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు విశ్వప్రసాద్‌తోనే ఉంటారని, ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని డిమాండ్ చే శారు. నాయకులు సలీం, రవీందర్, సాయి, కలీం, జావిద్, మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


