డోంట్‌ వర్రీ.. రికవరీ..! | - | Sakshi
Sakshi News home page

డోంట్‌ వర్రీ.. రికవరీ..!

Nov 30 2025 7:22 AM | Updated on Nov 30 2025 7:22 AM

డోంట్‌ వర్రీ.. రికవరీ..!

డోంట్‌ వర్రీ.. రికవరీ..!

● దొరుకుతున్న పోగొట్టుకున్న సెల్‌ఫోన్లు ● అందుబాటులోకి సీఈఐఆర్‌ వైబ్‌సెట్‌ ● ఇప్పటికే పలువురికి ఫోన్లు అప్పగింత ● వేగంగా రికవరీ చేస్తున్న పోలీసులు

కౌటాల: ప్రస్తుతం సెల్‌ఫోన్‌ లేకుండా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంతటి విలువైన మొ బైల్‌ ఫోన్లు ఒక్కోసారి అపహరణకు గురవుతుంటా యి. కొన్నిసార్లు మనమే ఎక్కడో మిస్‌ చేసుకుంటాం. ఆ తర్వాత బాధ పడుతుంటాం. అయితే ఇ దంతా గతం.. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి దొ రుకుతోంది. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజి స్టర్‌ (సీఈఐఆర్‌) వెబ్‌సైట్‌ అందుబాటులోకి వచ్చా క.. పోయిన ఫోన్లను ట్రేస్‌ చేయడం, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులభమైంది.

సెల్‌ఫోన్‌ పోతే ఫిర్యాదు ఇలా..

జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ సీఈఐఆర్‌ సౌ లభ్యం అందుబాటులో ఉంది. ముందుగా ఫోన్‌ పో యిన వెంటనే బాధితుడు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. మొబైల్‌ ఫోన్‌ ఈఎంఈఐ నంబర్‌ విధిగా పొందుపర్చాలి. ఎక్కడ పోయింది అనే వివరాలు అందజేయాలి. బాధితులు ఎఫ్‌ఐఆర్‌ ప్ర తి అందిన తర్వాత www.ceir.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్‌ ఓపెన్‌ చేసి అందులో ‘బ్లాక్‌ ఫోన్‌’ అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఫోన్‌ వివరాలు, పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, చిరునామా, పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు నంబర్‌, ఫోన్‌ కొనుగోలు చేసిన వ్యక్తి చిరునామా, ఈ–మెయిల్‌ ఐడీ, ధ్రువీకరణ కార్డులు సూచించిన బాక్స్‌ల్లో నింపాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత ఫాంను సబ్‌మిట్‌ చేయగానే పోగొట్టుకున్న ఫోన్‌ బ్లాక్‌ అవుతుంది. ఇక దానిని ఎవరూ ఆపరేట్‌ చేయలేరు. దానిలో డాటా సురక్షితంగా ఉంటుంది. సీఈ ఐఆర్‌ వెబ్‌సెట్‌లోకి వెళ్లి ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌తో బ్లాక్‌ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయదు. అందులో వేరే సిమ్‌కార్డు వేసినా వెంటనే బాధితుడికి ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ మెసేజ్‌తో యూజర్‌ పో గొట్టుకున్న సెల్‌ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉన్నదో సులభంగా తెలుసుకునే అవకాశముంది.

పాత ఫోన్‌తో పరేషన్‌..

ఎవరైనా తక్కువ ధరకు సెల్‌ఫోన్‌ అమ్ముతున్నారని కొనుక్కుంటే లేనిపోని చిక్కులు కోరి తెచ్చుకున్నట్లే. అది కొట్టేసిన ఫోన్‌ అయితే కొనుగోలుదారు మొ బైల్‌ ఆన్‌ చేయగానే పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఆ స్థలానికి వెళ్లి విచారించగా వేరేవాళ్ల వద్ద కొ న్నామని వారు సమాధానం చెప్పడంతో మందలించి వదిలేస్తున్నారు. కొన్నవారు ఆర్థికంగా నష్టపోతున్నారు. సెల్‌ఫోన్‌ ఎక్కడ కొన్నాడు? కొన్న బిల్లు? బాక్స్‌ అడిగాకే ఆ ఫోన్‌ కొనాలి. లేదంటే తిప్పలు పడాల్సి వస్తుంది. పాత ఫోన్‌ కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా..? బ్లాక్‌ లిస్ట్‌లో ఉందా? అన్న విషయం కేవైఎం (నో యువర్‌ మొ బైల్‌) విధానంలో ముందే తెలుసుకోవచ్చు. మొబైల్‌లో కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్‌ చేసి 15 అక్షరాల ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేసి 14,422కు ఎస్‌ఎంఎస్‌ చేయాలి. సెల్‌ఫోన్లలో విలువైన సమాచారం ఉండడంతో వాటి వినియోగం, కొనుగోలు విషయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

స్పీడ్‌గా రికవరీ

సెల్‌ఫోన్‌లో కీలక సమాచారం ఉంటుంది. అది అపహరణకు గురైతే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతారు. జిల్లాలో 6.50 లక్షల వరకు జనాభా ఉంటే అందులో దాదాపుగా 5లక్షలకుపైగా ఫోన్లు విని యోగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా అన్ని వయస్సులవారిలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగింది. గతంలో సెల్‌ఫోన్‌ అపహరణకు గురైనా.. పోగొట్టుకున్నా దొరకడం కష్టంగా ఉండేది. కానీ, గతేడాది మార్చి 15నుంచి రాష్ట్రంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలి కమ్యూనికేషన్‌ సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) వైబ్‌సెట్‌ అందుబాటులోకి తేవడంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ ఇట్టే దొరికిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో బాధితులు పో గొట్టుకున్న, చోరీ అయిన సెల్‌ఫోన్లు గుర్తించడంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం ముందంజంలో ఉంది. జిల్లాలో రెండేళ్లుగా 2వేల వరకు సెల్‌ఫోన్లు పోవడంతో పోలీసులు 1300కు పైగా మొబైల్‌ఫోన్లను గుర్తించారు. సుమారు రూ.14లక్షల విలువైన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement