విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కౌటాల: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి హెచ్చరించారు. కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం విషయంలో నిరసన తెలిపిన ఘటనపై శనివారం ఆయన కాగజ్‌నగర్ సబ్ కలెక్ట ర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన, పారిశుధ్య సిబ్బందిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. పాఠశాల హెచ్‌ఎం నారా యణ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ ఎంఈవో హన్మంతు ఆరోపణలపై వివరణ కోరారు. విద్యార్థుల నిరసన ఘటన రోజు విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల నుంచి విధి నిర్వహణలో అలసత్వం, ఘటనకు కారణాల పై వివరణ తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ను కచ్చితంగా పాటించాలని సూచించారు. పాఠశాలలోని చేతిపంపునకు వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ఆవరణలో నీరు నిల్వ కుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశా ల చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాహ్న భోజన నాణ్యత ను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, కార్యదర్శి సాయికృష్ణ తదితరులున్నారు.


