ఎస్పీఎం విభాగంలో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యుత్‌శాఖ కార్యాల య ఆవరణలోని ఎస్పీఎం ట్రాన్స్‌ఫార్మర్ రూర ల్ వర్క్‌షాప్‌లో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి ఆరుగురు దుండగులు వర్క్‌షాప్‌లోకి చొరబడి ఏడు ట్రాన్సఫార్మర్ జాబ్‌లలోని కాప ర్ తీగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన కాపర్ వై రు విలువ సుమారు రూ.3.5లక్షలు ఉంటుంద ని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలాన్ని ట్రాన్స్ కో ఎస్‌ఈ జాదవ్‌శేష్‌రావు పరిశీలించారు. చోరీకి గురైన ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అశోక్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్, క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


