నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణను శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ పత్రాలు, ధ్రువీకరణ, అభ్యర్థుల వివరాలు, రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని, ప్రచారాలు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్ తదితరులు ఉన్నారు.
కంచన్‌పల్లిలో పర్యటన
లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కంచన్‌పల్లి గ్రామంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. నామినేషన్ కేంద్రంతోపాటు గ్రామంలో పీఎం జన్‌మన్ పథకం కింద చేపట్టిన ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంచందర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


