ఊపందుకున్న నామినేషన్లు
● రెండోరోజు 222 దాఖలు
ఆసిఫాబాద్: జిల్లాలో గ్రామ పంచాయతీ నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో రెండోరోజు కదలిక వచ్చింది. తొలి రోజు జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లోని 115 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 15 నామినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం సర్పంచులకు 111 నామినేషన్లు, వార్డు సభ్యులకు 111 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 242కి చేరింది. కాగా శనివారంతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 నుంచి బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, పెంచికల్‌పేట్, సిర్పూర్(టి) మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం దాఖలైన నామినేషన్లు
మండలం సర్పంచ్ వార్డు
స్థానం స్థానం
జైనూర్ 20 32
కెరమెరి 29 25
లింగాపూర్ 20 06
సిర్పూర్(యూ) 14 12
వాంకిడి 28 36


