సామాజిక విప్లవకారుడు పూలే
ఆసిఫాబాద్‌అర్బన్: అణగారిన వర్గాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్‌నార్ రమేశ్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూప్‌నార్ రమేశ్ మాట్లాడుతూ అనేక పాఠశాలలను ప్రారంభించి ఎంతో మందిని విద్యావంతులుగా చేశారని కొనియాడారు. స్వయంగా భార్యకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దా రని తెలిపారు. మహనీయుడి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కేశవ్‌రావు, మారుతిపటేల్, మెంగాజీ, నికోడె రవీందర్, నాగోశే శంకర్, బాబురావ్, శ్యాం, అసద్, జలపతి, తిరుపతి, నాందేవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


