అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు

Nov 29 2025 7:17 AM | Updated on Nov 29 2025 7:17 AM

అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు

అట్టహాసంగా అథ్లెటిక్స్‌ పోటీలు

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్‌ లీగ్‌ పోటీలు అట్ట హాసంగా సాగాయి. ఈ పోటీలను డీటీడీవో రమాదేవి ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి పతకాలు, మెరిట్‌ సర్టిఫికెట్లు అందించారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా నుంచి వచ్చిన శిక్షకులు నాగరాజు, మణికంఠ ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్‌, డీఎస్‌వో షేకు, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్‌ కోచ్‌ విద్యాసాగర్‌, ఏటీడీవో శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement