పురుగుల అన్నం.. నీళ్ల చారు
కౌటాల(ఆసిఫాబాద్): ప్రతిరోజూ మధ్యాహ్న భోజ నంలో పురుగుల అన్నం.. నీళ్ల పప్పు వండి పెడుతున్నారని కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. పాఠశాల నుంచి భోజనం ప్లేట్లతోనే బయటకు వచ్చి కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ బియ్యాన్ని శుభ్రం చేయకుండా అన్నం వండుతున్నారని, మెనూ ప్రకా రం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. ప్రతిరో జూ పప్పు కూర పెడుతున్నారని, కూరగాయలు వండడం లేదన్నారు. నాసిరకం భోజనం తినలేక వాంతులు చేసుకుంటున్నామని వాపోయారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని తొలగించా లని డిమాండ్ చేశారు. రెండు గంటలపాటు రో డ్డుపై విద్యార్థులు నిరసన తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. కౌటాల తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంఈవో హన్మంతు, ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కార్మికురాలిపై చర్యలు తీసుకుంటామని, మెనూ ప్రకారం భోజనం అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు.


