జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్, చైర్మన్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్ జీసీసీ మేనేజర్ మనోహర్ గత ఆరు నెలల్లో సాధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సభ్యులు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరలకే డీఆర్ డిపో ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కందులు, మొక్కజొన్న, సోయా వంటి పంటలు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అనంతరం జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌ను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ మనోహర్, అటవీశాఖ డిప్యూటీ రేంజర్ హేమలత, సిబ్బంది చందు, ప్రదీప్, కృష్ణ, సత్యం, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్: జీసీసీ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డివిజనల్ మేనేజర్, సొసైటీ చైర్మన్ సందీప్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సొసైటీ అకౌంటెంట్ సదాశివ్, అటవీశాఖ రేంజ్ అధికారి గోవింద్‌చంద్ సర్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్యాముల్ మాథ్యూస్, దయాకర్ పాల్గొన్నారు.


