షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ముధోల్: మండల కేంద్రంలోని మజీద్ చౌక్ సమీపంలో గడ్డమొళ్ల రమేశ్‌కు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు రమేశ్ ఇంటిముందు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం ఇంటికి తాళంవేసి కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఆసమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్ మీటర్‌లోంచి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న బట్టలు, బీరువా, ఫ్రిడ్జి, కూలర్‌తో పాటు కిరాణా షాపుకోసం తీసుకువచ్చిన బియ్యం, పప్పులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గమనించిన స్థానికులు సిలిండర్ బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సమాచారం అందించినప్పటికీ రావడంలో ఆలస్యం జరగడంతో అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది. ఘటనలో సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఎస్సై బిట్ల పెర్సీస్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది.


