సమర్థవంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ డేవి డ్, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలి సి బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించా రు. లింగాపూర్, కెరమెరి, సిర్పూర్(యూ), జైనూర్, వాంకిడి మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నామినేషన్ల పరిశీలన, తుది అభ్యర్థుల జాబితా, గుర్తుల కేటాయింపు పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


