కట్టుబాట్లు పాటిద్దాం.. ఖర్చులు తగ్గిద్దాం
కెరమెరి: వివాహాది శుభకార్యాల్లో కట్టుబాట్లకు ప్రతిఒక్కరూ కట్టుబడి ఉండాలని రాజ్‌గోండ్ సేవా సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చందన్‌శావ్, మండల అధ్యక్షుడు పెందోర్ మోతిరాం అన్నారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిశ్చితార్థం కార్యక్రమానికి అవసరమైన తక్కువ మంది మాత్రమే వెళ్లాలని, వధువును వరుడి ఇంటికి రాత్రివేళాల్లో తీసుకెళ్లాలని, రెడీమేడ్ మండపం పెట్టొద్దని, కట్నకానుకలు ఆర్థిక రూపంలో ఇవ్వాలని, తదితర మరో పది నిబంధనలు విధిస్తూ తీర్మానం చేశారు. దీనిని సార్‌మెడీలు, గ్రామ పటేళ్లు, దేవారీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో నాయకులు జంగు, సోము, మడావి రఘునాథ్, దండు, తుకారాం, భీంరావు, ప్రభాకర్, జాలింశావ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.


