‘పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం’
ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఎమ్మె ల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్‌తో కలిసి వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 335 సర్పంచ్ స్థానాలకు కేవలం 20 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. కాగజ్‌నగర్ డివిజన్‌లో 11.11శాతం, ఆసిఫాబాద్ డివిజన్‌లో 7.21శాతం స్థానాలు మాత్రమే దక్కాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో ప్రసాద్, కిరణ్, అరుణ్ లోయ, అనిల్ తదితరులు ఉన్నారు.


