‘పోలీసులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు’
ఆసిఫాబాద్‌అర్బన్: పోలీసులను అడ్డుపెట్టుకుని బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్‌నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలు దహనం చేసే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చీకటి ఒప్పందం కారణంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించకుండా ఎన్నికలకు వెళ్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, నాయకులు లహుకుమార్, మారుతి పటేల్, నాందేవ్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


