‘పోరు గర్జన’కు అనుమతివ్వాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించే ఆదివాసీ ఆస్తిత్వ పోరు గర్జన సభకు అనుమతివ్వాలని ఆదివాసీ సంఘాల నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంలో ఎస్పీ నితిక పంత్‌కు వినతిపత్రం ఇచ్చారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు విజయ్, ప్రధాన కార్యదర్శి మారు తి మాట్లాడుతూ డిసెంబర్ 9న జిల్లా కేంద్రంలో నిర్వహించే సభకు ఆదివాసీ రాష్ట్ర నాయకులు, ప్రజలు హాజరవుతారని తెలిపారు. చట్ట బద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ప్రధాన ఎజెండాతోపాటు ఆది వాసీల ఆస్తిత్వం, హక్కుల కోసం సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భీంరావ్, నాయకులు సుధాకర్, జగన్, యాదోరావ్ తదితరులు పాల్గొన్నారు.


