మహిళల ఆర్థిక ఎదుగుదలకు చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: మహిళల ఆర్థిక ఎదుగుదల కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్‌లో డీఆర్‌డీవో దత్తారావు అధ్యక్షతన మంగళవారం ఎమ్మెల్యే హరీశ్‌బాబు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి చీరల పంపిణీని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులందరికీ చీరలు అందిస్తామని తెలిపారు. నిర్మాణ దశలో ఉన్న జిల్లా సమైఖ్య భవనం త్వరలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాల తిరిగి చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తున్నారని, జిల్లాలో 98శాతం తిరిగి చెల్లింపు జరగడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీతోపాటు రూ.2.70 కోట్ల వడ్డీలేని రుణాలు, రూ.26.53 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు అందించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి, డీపీఎం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


