వెల్ఫేర్ బోర్డు ద్వారా పథకాలు అందించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జీవో నం.12 సవరించి భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు అందించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ నాలుగు స్కీంలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం జీవో 12ను విడుదల చేసిందని తెలిపారు. బీమా కంపెనీలకు అక్రమంగా నిధులు కూడా బదిలీ చేశారని ఆరోపించారు. తక్షణమే సీఎస్సీ హెల్త్ టెస్టులు రద్దు చేస్తూ కార్మికులకు హెల్త్ కార్డులు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, ఆనంద్‌రావు, రవి, రాజన్న, తిరుపతి, కమలాకర్, రాంచందర్, రాజన్న పాల్గొన్నారు.


