ప్రారంభమైన బాల వైజ్ఞానిక ప్రదర్శన
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో సోమవారం 53వ రాజ్యస్తరీయా బాల వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభమైంది. జిల్లా సైన్స్ అధికారి మధుకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మూడు రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 400 మంది విద్యార్థులు ఏడు అంశాలపై 300 ప్రదర్శనలు నమోదు చేసుకున్నారనన్నారు. ఇందులో 280 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు, 120 ఇన్‌స్పైర్ మనాక్ ప్రాజెక్టుల ప్రదర్శనలు ఉన్నట్లు పేర్కొన్నారు. 20 మందితో కూడిన జ్యూరీ కమిటీ సభ్యులు(జడ్జీలు) పరిశీలించి 33 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు.


