సమస్యలు పరిష్కరించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రేకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారి 20 నెలలు గడుస్తున్నా నేటికీ కార్మికులకు పాత పద్ధతిలోనే పంచాయతీ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. జీవో నం.60 ప్రకారం వేతనాలు అందించాలని కలెక్టర్‌కు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాట్ల రాజు, కార్యదర్శి శంకర్, నాయకులు కృష్ణమాచారి, సంజీవ్, మల్లేశ్, వినోద్, ప్రభాకర్, అశోక్, బాలేశ్ తదితరులు పాల్గొన్నారు.


