వైన్‌షాపు ఎత్తివేయాలని మహిళల ధర్నా
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాం గ్రామ పంచాయతీ పంచశీల నగర్‌లో ఏర్పాటు చేసిన వైన్‌షాప్‌ను ఎత్తివేయాలని మహిళలు సోమవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈజ్‌గాం చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించారు. మహిళలు మాట్లాడుతూ ఇళ్ల మధ్య మద్యం దుకాణం ఉండటంతో మందుబాబులతో ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. గంటపాటు ధర్నా నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు మహిళలకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు మమత రానా, కాజల్ బిశ్వాస్, సుచిత్ర, డీవైఎఫ్‌ఐ ఉపాధ్యక్షురాలు నిఖిల్, నాయకులు ఇంద్రమండల్, ప్రకాశ్, రాణా, ప్రశాంత్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


