గుణాత్మక విద్యను అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని డీటీడీవో రమాదేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో గిరిజన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీడీవో పలు సూచనలు చేశారు. ఐదు రోజులపాటు నిర్వహించే శిక్షణను ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేర్చుకున్న నూతన విద్యా విధానాలతో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, జీసీడీవో శకుంతల, డీఎస్‌వో షేకు, హెచ్‌ఎం లక్ష్మయ్య, రిసోర్స్‌పర్సన్లు అమరేందర్, మహేశ్వర్ పాల్గొన్నారు.


