భీం పోరాటం స్ఫూర్తిదాయకం
కెరమెరి(ఆసిఫాబాద్): కుమురంభీం పోరాటం స్ఫూర్తిదాయకమని ఎస్పీ నితిక పంత్ అన్నారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి కెరమెరి మండలం జోడేఘాట్‌ను సందర్శించి భీంకు నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. మ్యూజియంలోని గుస్సాడీ ప్రతి మలు, ఆదివాసీల ఆభరణాలు, వాయిద్యాలు తిలకరించారు. అనంతరం మాట్లాడుతూ ఆదివాసీ హ క్కుల కోసం భీం సాగించిన పోరాటం మరువలేని దన్నారు. ఇలాంటి పుణ్యభూమిని సందర్శించడం అదృష్టమని పేర్కొన్నారు. అంతకు ముందు ఆది వాసీలు పూలమాలతో ఎస్పీకి స్వాగతం పలికారు. తలపాగా చుట్టి నుదుటిన తిలకం దిద్దారు.
గిరిజనుల భద్రతపై ప్రత్యేక దృష్టి
మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కెరమెరి మండలంలోని జోడేఘాట్, కొలాంగూడ గ్రామాల్లోని ఆదివాసీలకు 50 బ్లాంక్లెట్లు, యువకులకు వాలీబాల్ కిట్లు అందించారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే సమాచారం అందించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సత్యనారాయణ, ఎస్సై మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


