టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ నెల 25న ప్రధాన మంత్రికి ఈ– మెయిల్, పోస్టు ద్వారా వినతిపత్రాలను పంపిస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా ఎంపీలను కలిసి విన్నవిస్తామన్నారు. ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ప్రకారం 2010 ఆగస్టు 23 ముందు నియామకమైన ఉపాధ్యాయులు టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సభ్యులు సుభాష్, రవికుమార్, శ్రీనివాస్, శివ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


