‘సత్యసాయి బోధనలు శాంతికి మార్గదర్శకాలు’
ఆసిఫాబాద్‌అర్బన్: సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు విశ్వశాంతికి మార్గదర్శకాలని, సత్యసాయి బాబా చేసిన సేవ, ధర్మ మార్గం ఎల్లవేళలా అనుసరణీయమని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన శ్రీ సత్యసా యి బాబా శత జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ సేవే పరమావధిగా సేవ కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారని కొనియాడారు. ప్రేమ, ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో డీపీఆర్‌వో సంపత్‌కుమార్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


