ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్
కాగజ్‌నగర్‌టౌన్: ఫిట్‌ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కే రన్ కార్యక్రమాన్ని ఆదివా రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొ న్న బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ 5కే ర న్ శారీరక దృఢత్వం కోసమే కాకుండా యువతలో ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఐ క్యతను పెంపొందిస్తుందన్నారు. ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌లో పాల్గొన్న యువతీయువకులను అభినందించారు. రన్‌లో పాల్గొన్న వారికి బ హుమతులు అందజేశారు. ఫౌండేషన్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు శ్యాంరావు, సత్యనారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు.


