మంచి శిక్షణ ఇస్తున్నారు
మా పాఠశాలలో కోచ్‌లు రోజూ మంచి శిక్షణ ఇస్తున్నారు. వారి సలహాలు, సూచనలు పాటిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధిస్తున్నాం. ప్రస్తుతం ఎస్జీఎఫ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాను.
– మాడావి చిన్నుబాయి, పదోతరగతి
అంతర్జాతీయ పోటీల్లో గెలవాలి
నేను రెండుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నా లక్ష్యం అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడమే. ఇదే లక్ష్యంతో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ కోచ్‌ల పర్యవేక్షణలో కష్టపడి సాధన చేస్తున్నాను.
– ఆడే నందిని, పదోతరగతి
కోచ్ కావాలని ఉంది
ఖోఖోలో రెండుసార్లు జా తీయ, ఎనిమిది సార్లు రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని వివిధ పతకాలు సాధించా ను. భవిష్యత్‌లో కోచ్‌గా గిరిజన బాలికలను మంచి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం.
– కుమ్మ సత్యశీల, పదోతరగతి
ఆరు స్వర్ణాలు సాధించాను
హ్యాండ్‌బాల్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పా ల్గొని విజయం సాధించా లనేది నా లక్ష్యం. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి పోటీ ల్లో ప్రతిభ కనబర్చి ఆరు బంగారు పతకాలు సాధించాను. జాతీయ స్థాయిలో రెండుసార్లు పాల్గొన్నాను.
– సిడాం అనిత, విద్యార్థిని
మంచి శిక్షణ ఇస్తున్నారు
మంచి శిక్షణ ఇస్తున్నారు
మంచి శిక్షణ ఇస్తున్నారు


