ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం
ఉదయం, సాయంత్రం విద్యార్థినులకు మెళకువలు నేర్పిస్తూ మంచి క్రీ డాకారిణులుగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధిశాఖ క్రీడారంగానికి మరిన్ని నిధులు కేటాయిస్తే ప్రోత్సాహంగా ఉంటుంది.
– అరవింద్, హ్యాండ్‌బాల్ కోచ్
మరిన్ని వసతులు కల్పించాలి
పాఠశాలలోని విద్యార్థి నులకు అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉంది. సింథటిక్ ట్రాక్, గ్రౌండ్ తదితర వసతు లు కల్పించాలి. ఇప్పటివరకు ఖోఖోలో 20మంది జాతీయ, 60 మంది రాష్ట్రస్థాయిలో పాల్గొన్నారు.
– తిరుమల్, ఖోఖో కోచ్
జాతీయ స్థాయిలో రాణించేలా..
అథ్లెటిక్స్ విభాగంలో జాతీయ స్థాయిలో 30 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. ఒక బంగారు, రెండు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో విజయం సాధించేలా బాలికలకు మంచి శిక్షణ ఇస్తున్నాం.
– విద్యాసాగర్, లెవల్–2 అథ్లెటిక్స్ కోచ్
ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం


