రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌అర్బన్: స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర ఖోఖో పోటీలకు ఆసిఫాబాద్ ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులు కోరెంగ బాపురావ్, ఆత్రం పవన్‌కుమార్ ఎంపికైనట్లు హెచ్‌ఎం కనక కర్నూ, పీడీ హీరాబా యి శనివారం తెలిపారు. వీరు ఈనెల 23నుంచి 25వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతగి జేపీఎస్‌ఎస్‌లో నిర్వహించనున్న అండర్–17 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపికై న విద్యార్థులను శనివారం జిల్లా కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో డీటీడీవో రమాదేవి, డీవైఎస్వో అశ్వఖ్ హైమద్, జిల్లా పాఠశాల క్రీడల అధికా రి వెంకటేశ్, గిరిజన క్రీడల అధికారి షేకు, ఏసీఎంవో దువ్, జీడీడీవో శకుంతల, ఏటీడీవో శివకృష్ణ, హెచ్‌డబ్ల్యూవో మధుకర్, ఖేలో ఇండియా కోచ్ కడతల రాకేశ్, అధ్యాపకులు అభినందించారు.


