ప్రణాళికతో ముందుకు సాగాలి
ఆసిఫాబాద్‌అర్బన్: లక్ష్యాల సాధనకు ప్రణాళికతో ముందుకు సాగాలని కాగజ్‌నగర్ అసిస్టెంట్ ట్రెజరీ అధికారి పంకజ్ పాల్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్, ఇందుకు పాటించాల్సిన సలహాలు, సూచనలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విజయం ఎవరి సొత్తు కాదని, నిజాయితీగా కష్టపడితే తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించారు. మంచిర్యాల అసిస్టెంట్ ఆడిట్ అధికారి అరవింద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయులు మల్లేశ్, శ్రీవర్ధన్ పాల్గొన్నారు.


