జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థ
● క్రీడాకారుల కార్ఖానాగా స్పోర్ట్స్ స్కూల్ ● పతకాల పంట పండిస్తున్న బాలికలు ● రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణింపు ● సర్కారు ప్రోత్సహిస్తే మరిన్ని విజయాలు
విద్యార్థినులు సాధించిన ఘనత
ఈ పాఠశాలలో మంచి ప్రతిభ, నైపుణ్యం గల ము గ్గురు కోచ్‌లు బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, ఖోఖో కోచ్ తిరుమలేశ్ నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థినులకు శిక్షణ ఇస్తూ మెళకువలు నేర్పుతున్నారు. పాఠశాల ప్రారంభించిన 2019 నుంచి 2025 వరకు 76మంది విద్యార్థినులు జాతీయ, 386 మంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ముగ్గురు బంగారు పతకాలు, 12 మంది కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. అథ్లెటిక్స్ విభాగంలో 30 మంది వి ద్యార్థులు పాల్గొనగా మూడు గోల్డ్ మెడల్స్ సాధించారు. ముగ్గురు జాతీయ స్థాయి శిక్షణ శిబిరానికి ఎంపికయ్యారు. హ్యాండ్‌బాల్‌లో 35మంది జాతీ య స్థాయికి, ఒకరు అంతర్జాతీయ స్థాయిలో ఆడా రు. ఖోఖోలో 20మంది జాతీయస్థాయిలో ఆడి పతకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో 386మంది పాల్గొనగా.. ఇందులో 113 బంగారు పతకాలు, 25 సిల్వర్, 44 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ప్రతీ ఆటలో ఓటమి ఎరుగని క్రీడాకారిణులుగా సత్తా చాటుతున్నారు. జాతీయస్థాయి జావెలిన్ త్రో అండర్ 14 విభాగంలో 40 మీటర్ల త్రోలో దేశంలోనే తొలి క్రీడాకారిణి విద్యార్థిని సాక్షి రికార్డు సాధించింది. ఈ క్రీడా పాఠశాల ప్రారంభంలో ఇచ్చిన క్రీడా కిట్లు మినహా ఇప్పటివరకు ఎలాంటి క్రీడా సామగ్రి ఇవ్వలేదు. దీంతో క్రీడల సాధన సమయంలో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలోని క్రీడా మైదానం కూడా సరిగా లేదు. వానాకాలంలో ఇందులో నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. రన్నింగ్ ట్రాక్ కూడా అనుకూలంగా లేదు. సింథటిక్స్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే క్రీడలకు అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి పాఠశాలకు గుర్తింపు తెస్తున్న పలువురు క్రీడాకారిణుల అభిప్రాయాలు వారి మాటల్లోనే..


