ఆర్టీవో అవినీతిపై విచారణ చేపట్టాలి
కాగజ్‌గనర్ టౌన్: ఆసిఫాబాద్ ఆర్టీవో కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని కోసిని గ్రామంలోగల ఆయన నివా సంలో విలేకరులతో మాట్లాడారు. ఆసిఫాబాద్ ఆర్టీ వో ఆఫీస్ అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింద ని, ఒక్కో పనికి ఒక్కో రేటు నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఏసీబీ అధికారులు వస్తే ముందే సమాచారం తెలుస్తుందని, ఆరోజు ద ళారులు, ఏజెంట్లు కార్యాలయానికి రాకుండా జాగ్ర త్త పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చెక్‌పోస్టులు ఎత్తివేయడంతో ఆదాయం తగ్గిందని, ఆర్టీఐ అధికారులు వాహనదారులను వేఽధిస్తున్నారని ఆరో పించారు. స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నట్లు తెలిపారు. దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన తలండి శ్రావణి కు లాంతర వివా హం చేసుకుని హత్యకు గురైతే బాధిత కు టుంబానికి చట్టప్రకారం రావాల్సిన పరిహారం నెల గడిచినా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి కొనుగోళ్ల ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ దివారం నిర్వహించనున్న ప్రతిజ్ఞా దివస్‌లో కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆయన వెంట శ్యాంరావు, సత్యనారాయణ, వెంకటేశం, అంజన్న, హన్మంతు తదితరులున్నారు.
ఆర్టీవో అవినీతిపై విచారణ చేపట్టాలి


