కార్మికుల హక్కులను హరించొద్దు
ఆసిఫాబాద్‌అర్బన్: కార్మిక హక్కులను హరించే నా లుగు లేబర్ కోడ్‌ల అమలుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని శనివారం కలెక్టరేట్ ఎదుట సీఐటీ యూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వేతనాల కోడ్ (2019), పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020), సామాజిక భద్రత కోడ్ (2020), వృత్తి పరమైన భ ద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లను నవంబ ర్ 21, 2025 నుంచి అమలు చేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని సీఐటీయూ పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, సమ్మె, ధర్నాలు చే సినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. నాలు గు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణమాచారి, శ్రీకాంత్, మాట్ల రాజు, సమ్మయ్య, శంకర్, మాయ, సుగుణ, ప్రభాకర్, మాన్కు, ప్రసాద్ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలో..
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్య పోరాటాల కు సిద్ధమవుతున్నారని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు సంజీవ్, రమేశ్, మల్లేశ్, తిరుపతి, సువర్ణ, సరిత, కుమారి ఉన్నారు.


