పేద గిరిజనులకు కేంద్రం అండ
ఆసిఫాబాద్: గూడు లేని పేద గిరిజనులకు కేంద్ర ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రైతువేదికలో శనివారం ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని పీవీటీజీ లబ్ధిదారులకు పీఎం జన్‌మన్ కింద మంజూరైన ఇళ్ల మంజూరు పత్రాలను కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఇళ్లు మంజూరు కాని అర్హులకు రెండో విడతలో మంజూరు చేస్తామని తెలిపారు. పీవీటీజీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇప్పటికే మల్టీపర్సస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ.. జిల్లాకు 2,169 ఇళ్లు మంజూరు కాగా, వీటిలో అత్యధికంగా ఆసిఫాబా ద్, తిర్యాణి మండలాలకే వచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ.. లబ్ధిదారులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఎవరికి వారే ఇళ్లు నిర్మించుకుంటే నాణ్యత ప్రమాణాలు బాగుంటాయని చెప్పారు. జెడ్పీ సీఈవో లక్ష్మీనారా యణ, హౌసింగ్ పీడీ ప్రకాశ్, డీఈ వేణుగోపాల్, విండో చైర్మన్ అలీబిన్‌అహ్మద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అరిగెల నాగేశ్వర్‌రావు, మంజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి మండలం సుంగాపూర్‌లో..
తిర్యాణి: మండలంలోని సుంగాపూర్ గ్రామంలో ఎంపీ గోడం నగేశ్ 18మంది జన్‌మన్ పథకం లబ్ధి దారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మితో కలిసి ఇళ్ల మంజూ రు పత్రాలు అందజేశారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స మావేశానికి హాజరై మాట్లాడారు. మొదటి విడతలో ఇళ్లు రాని వారికి వచ్చే విడతలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ డేవి డ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌసింగ్ పీడీ ప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, నాయకులు హన్మాండ్ల జగదీశ్, శ్రీదేవి, ఆత్రం చంద్రశేఖర్, గుణవంత్‌రావు, రమేశ్ తదితరులున్నారు.


