పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి అన్నా రు. మండలంలోని కొలాంసాలెగూడలో శుక్రవారం పర్యటించారు. పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన నూతన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు జలపతి, కార్యదర్శి పద్మ పాల్గొన్నారు.
ఎనోలి కొలాంగూడలో దుప్పట్లు పంపిణీ
వాంకిడి(ఆసిఫాబాద్): మండలంలోని ఎనోలి కొలాంగూడలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి శుక్రవారం రాజు ఫౌండేషన్ ద్వారా 20 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పీఎం జన్‌మన్ పథకం కింద గ్రామానికి 19 ఇళ్లు మంజూరైనా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని, సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


